![]() |
![]() |

భోలే షావలి.. పాట బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. గ్రాంఢ్ లాంఛ్ 2.0 లో అంబటి అర్జున్, నయని పావని, పూజామూర్తి, భోలే షావలి, అశ్వినిశ్రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
కిక్2 సినిమాలోని 'కంఫర్ట్' పాట పాడింది భోలే షావలిని ఎంతమందికి తెలుసు. ఇక ఈ మధ్య మ్యూజికల్ హిట్ గా నిలిచిన 'పాలు అమ్మిన' పాట భోలే షావలీయే పాడింది. వీటితో పాటు పలు సినిమాల్లో కూడా పాడిన భోలే షావలి.. తెలంగాణ ఫోక్ సాంగ్స్ కి మ్యూజిక్ ఇచ్చాడు. అవన్నీ యూట్యూబ్ లో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే పాటలే. కాగా అతడికి అభిమానులు చాలానే ఉన్నారు. అయితే ప్రియాంక, శోభా శెట్టి కలిసి నామినేషనలో వాళ్ళ మాటలతో చాలా భాదపెట్టారని భోలే షావలి వాళ్ళ అమ్మ ఒక ఇంటర్వ్యూ లో కన్నీళ్ళు పెట్టుకుంది. ఇలా బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు సైతం తమ పిల్లల గురించి జరుగుతున్న నెగిటివ్ కామెంట్లు, ప్రచారం గురించి స్పందించి క్లారిటీ ఇవ్వడం కేవలం ఈ సీజన్ లోనే జరుగుతోంది. భోలే షావలి తల్లి తాజాగా ఎమోషనల్ అవుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నా కొడుకు మనస్సు ఎంతో మంచిదని పది మందికి అన్నం పెట్టే మంచి మనస్సు ఉందని ఆమె అన్నారు.
నామినేషన్లో జరిగిన గొడవలో తన కొడుకిని అంత తీవ్రంగా అంటారని అనుకోలేదని భోలే షావలి తల్లి చెప్పింది. నా కొడుకుని ప్రియాంక జైన్ "థూ" అని అనడానికి రీజన్ నాకు తెలియదని భోలే షావలి తల్లి చెప్పుకొచ్చారు. నా కొడుకు నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాడని, నా రక్తం ఉడుకుతోందని ఆమె చెప్పుకొచ్చారు. ఎక్కడికి వెళ్లినా నా కొడుకు నా ఆశీర్వాదాలు తీసుకొని వెళతాడని ఆమె అన్నారు. అయితే ప్రస్తుతానికి నామినేషన్లో ఉన్న భోలే షావలికి ఓట్లు కూడా భారీగానే పడుతున్నాయి.
![]() |
![]() |